విలన్ గా అబ్బాస్ .. ఓటీటీకి వస్తున్న 'ఎగ్జామ్' సిరీస్!

  • తమిళ సిరీస్ గా 'ఎగ్జామ్'
  • ప్రధాన పాత్రల్లో దుషారా విజయన్ - అదితి బాలన్ 
  • కీలమైన పాత్రలో అబ్బాస్ 
  • మే 15 నుంచి స్ట్రీమింగ్ 
  • ఐదు భాషల్లో అందుబాటులోకి  

కోలీవుడ్ తెరపై అందమైన హీరోల జాబితాలో కొంతకాలం పాటు మెరిసిన పేరు అబ్బాస్. 'ప్రేమదేశం' సినిమాతో ఆయనకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ తరువాత హీరోగాను .. హీరో స్థాయి తరువాత పాత్రలలోను ఆయన కొంతకాలం పాటు సందడి చేశాడు. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియలేదు. చాలా కాలం తరువాతనే ఆయన గురించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

అబ్బాస్ మళ్లీ సినిమాలలో చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపించడం మొదలైంది. అనవసరంగా ఆయన వెండితెరకి దూరమయ్యాడంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా విడుదలైన 'హ్యాపీ రాజ్' సినిమాతో అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆయన హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించాడు. విలన్ రోల్స్ కి ఆయన బాగా సెట్ అవుతాడని అనిపించుకున్నాడు. 

అనుకున్నట్టుగానే విలన్ షేడ్స్ కలిగిన ఒక కీలకమైన పాత్రలో ఆయన ఒక వెబ్ సిరీస్ చేశాడు. అబ్బాస్ తొలిసారిగా నటించిన ఆ తమిళ సిరీస్ పేరే 'ఎగ్జామ్'. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లోని లొసుగులను బహిర్గతం చేసే దిశగా ఈ సిరీస్ కొనసాగుతుంది. తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దుషారా విజయన్, అదితి బాలన్ నటించిన ఈ సిరీస్ కి సర్కుణం దర్శకత్వం వహించారు. పుష్కర్ - గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించిన ఈ సిరీస్, 5 భాషల్లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 


Abbas
Abbas actor
Exam series
Tamil web series
Dushara Vijayan
Aditi Balan
Sarkunam director
Pushkar Gayathri
Happy Raj movie
Kollywood

More Telugu News